ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం ఒక సరికొత్త పధకం ప్రవేశ పెట్టనున్నారు. మన దేశం లో ఫోన్ భూత్ లు ఉన్నట్టు టాయిలెట్లు ఉండవు. ఇప్పుడు అదే లాజిక్ తో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫద్నవిస్ ఒక ప్రపోజల్ తో వచ్చారు. ముంబాయి లో ప్రతీ 500 మీటర్ కు ఒక టాయిలెట్ ఉండే విధంగా ఒక పథంక రూపొందించారు. మే 1 న 5000 మంది స్టూడెంట్స్ సమక్షం లో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే పోతే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ దేశం లో ఎక్కడ కాస్త నైతిక విలువలుకు విరుద్దంగా జరిగిన దానికి బాగా స్పందిస్తాడు. అలానే ఈ టాయిలెట్స్ ఐడియా ఒక మంచి నిర్ణయం కాబట్టి తను ప్రచారకర్తగా వ్యవహరించడానికి ముందుకు వచ్చాడు.
కాని అందరు బాలీవుడ్ స్టార్స్ అంటే పెద్ద బ్రాండ్లకు మాత్రమే ప్రచారం చేస్తారు అనుకుంటారు. ఆ మాట పూర్తిగా సరికాదు అని ప్రముఖ బాలీవుడ్ స్టార్స్ నిరూపించుకున్నారు. ఎందుకంటే చాలా మంది స్టార్స్ ఎయిడ్స్ పైన పోలియో పైన.. మూత్ర విసర్జన పైన.. కండోమ్ వాడకం పైన.. ఇలా ప్రజలకు బాగా ఉపయోగపడే ప్రభుత్వ పథకాల గురించి కూడా ప్రచారం చేస్తారు. అమితాబ్ – విద్య బాలన్ – సల్మాన్ ఖాన్ – అమీర్ ఖాన్ ఇలా చాలామంది బాలీవుడ్ స్టార్స్ వలంటీరాగా ప్రచారం నిర్వహించారు.ఇప్పుడు అదే బాటలో అక్షయ్ కూడా నడుస్తున్నాడు మరి.
ఈ టాయిలెట్ పథకం కోసం ఒక యాప్ కూడా డిజైన్ చేస్తారట మహారాష్ట్ర ప్రభుత్వం. స్వఛ్ భారత్ అభియాన్ టార్గెట్ ప్రకారం ముంబాయి కి 1.28 లక్షలు టాయిలెట్స్ కావాలి. ఈ కాన్సెప్ట్ ఐతే మాత్రం అదిరింది మరి ఆచరణ ఎలా ఉంటుంది.. జనాలలో అవగాహణ ఎలా పెంచుతారో చూడాలి.