వరుస ఫ్లాపులు.. అక్షయ్ షాకింగ్ నిర్ణయం!

47
akshay
- Advertisement -

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నారు హీరో అక్షయ్ కుమార్. ఇటీవల రక్షాబంధన్ సినిమాతో వచ్చినా ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. దీంతో అక్షయ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.

తన తర్వాతి సినిమాలకు రెమ్యునరేషన్ సగానికి పైగా తగ్గించుకున్నారట. అయితే రెమ్యునరేషన్ తగ్గించుకున్నా సినిమా హిట్ అయి లాభాలు వస్తే మాత్రం వాటా ఇవ్వాలని చెప్పగా నిర్మాతలు ఓకే చెప్పారట. అక్షయ్ తీసుకున్న నిర్ణయం వల్ల సినిమా వ్యయం తగ్గుతుందని నిర్మాతలు చెబుతున్నారు.

ఇండియాలో అత్యధికంగా ట్యాక్స్ పే చేసేవాళ్ళల్లో అక్షయ్ ఒకరు. అక్షయ్ నటించిన గత నాలుగు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఒక్కో సినిమాకి అక్షయ్ దాదాపు 70 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటాడని సమాచారం.

- Advertisement -