మరోసారి జంటగా అక్కినేని దంపతులు

205
Nagachaitanya Samantha

అక్కినేని హీరో నాగచైతన్య సమంత జంట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరు జంటగా దాదాపు 5సినిమాల్లో నటించారు. చివరగా సమంత, నాగచైతన్య జంటగా నటించిన చిత్రం మజిలీ. ఈమూవీ మంచి విజయం సాధించింది. తాజాగా ఉన్న సమాచారం మేరకు మరోసారి విరిద్దరు కలిసి నటించబోతున్నారని తెలుస్తుంది. ఇటివలే ఓ నూతన దర్శకుడు చైతూ, సమంతను కలిసి కథ వినిపించాడట. కథ నచ్చడంతో మూవీ చేయాలని నిర్ణయించుకున్నారట. ఈసినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

ఈ చిత్రాన్ని తమ సొంత బ్యానర్ పై నిర్మించడానికి ఈ జంట ప్లాన్ చేస్తోందట.నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమాలో చేస్తున్నాడు. ఈమూవీ తర్వాత గీత గోవిందం దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు. ఇక సమంత జాను మూవీతో హిట్ సాధించింది. మరోసారి వీరిద్దరు జంటగా నటిస్తుండటంతో ఈమూవీపై పెద్ద ఎత్తున అంచనాలు నెలకొన్నాయి.