సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ, అక్కినేని హీరో నాగార్జున కాంబినేషన్ లో ఇటివలే వచ్చిన సినిమా ఆఫీసర్. భారీ అంచనాల మధ్య ఈసినిమా విడుదలైన విషయం తెలిసిందే. మొదటి షో నుంచే ఈసినిమాపై నెగిటెవ్ టాక్ రావడంతో భారీ డిజాస్టర్ ను సొంతం చేసుకుంది ఆఫీసర్. వర్మ మిద ఎంతో నమ్మకం పెట్టుకుని ఈసినిమాను ఒప్పుకున్నాడు నాగార్జున. వరుస హిట్లతో మంచి ఫామ్ లో ఉన్న నాగార్జునకు భారీ డిజాస్టర్ ఇచ్చిన రాం గోపాల్ వర్మపై అక్కినేని అభిమానులు చాలా కోపంగా ఉన్నారు. దింతో రామ్ గోపాల్ వర్మ పై వినూత్న రితీలో నిరసన తెలిపారు అక్కినేని అభిమానులు.
ఓ నిజాయితి గల పోలీస్ ఆఫీసర్ జీవిత కథ అంటూ వర్మ చెప్పిన స్టోరీపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు నాగార్జున. చివరకు సినిమా ఘోర పరాజయం కావడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు అక్కినేని అభిమానులు. అక్కినేని కుటుంబాన్ని వదిలేయాలంటూ నిరసన తెలిపారు అభిమానులు. దింతో వర్మ కటౌట్ కు పాలాభిషేకం చేశారు. నాగార్జున కెరీర్ లో ఇంత ఘోరంగా ఏ సినిమా డిజాస్టర్ సాధించలేదన్నారు. జూన్ 1వ తేదిన విడుదలైన ఈసినిమా ఇప్పటి వరకూ కనీసం కోటి రూపాయలు కూడా రాబట్టేదన్నారు అక్కినేని ఫ్యాన్స్.
ఇక నుంచి అయితే వర్మ అక్కినేని హీరోయిలను వదిలేసి తన సినిమాలు తాను తీసుకుంటే మంచిదన్నారు. నాగార్జున కెరీర్ లోనే ఇంత పెద్ద డిజాస్టర్ అవడం ఇదే తొలిసారి అన్నారు ట్రేడ్ వర్గాలు. ఇక వర్మ త్వరలో అఖిల్ తో కూడా ఓ సినిమా తీయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దింతో అక్కినేని అభిమానులు వర్మపై చాలా సిరియస్ గా ఉన్నారు. గత పదేళ్లుగా ఒక్క హిట్ కూడా లేని వర్మ ఇక సినిమాలు తీయడం మానేయాలన్నారు. తమ అభిమాన నటులైన అక్కినేని హీరోలను వదిలేయాలని నిరసన తెలిపారు. నాగార్జున తో తిసిన ఆఫీసర్ సినిమా ఇంత పెద్ద డిజాస్టర్ సాధిచండంతో..అఖిల్ వర్మతో సినిమాకు ఒప్పుకుంటాడో లేదో అని ఫిలీం నగర్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.