అఖిల్ పెళ్లి ఖర్చు ఎంతో తెలుసా..?

257
akhil
- Advertisement -

అంతర్జాతీయంగా పేరున్నసంస్థ జీవీకే. అలాంటి ఈ సంస్థ ఛైర్మన్ మనవరాలి పెళ్లంటే మాటలా? స్టేటస్ కు తగ్గట్టు పెళ్లి భారీగానే చేస్తారనడంలో సందేహంలేదు.మనవరాలి పెళ్లిని గ్రాండ్ గా జరిపేందుకు గునిపాటి వెంటక కృష్ణారెడ్డి భారీగా ఖర్చుచేయబోతున్నాడట.డిసెంబర్ 9వ తేదీన వీరి నిశ్చితార్థం హైద్రాబాదులోని జీవీకే హౌస్ లో అంగరంగ వైభవంగా జరగనుంది.

అయితే పెళ్లి మాత్రం యూరోప్ లో ప్లాన్ చేశారు. కానీ, అక్కినేని కుటుంబానికి పెళ్లి ఇండియాలోనే చెయ్యాలని ఉందట. అయితే వియ్యంకుల వారి కోరికను అక్కినేని ఫ్యామిలీ కాదనలేకపోతుందట. అందుకే పెళ్లి యూరప్ లోనే జరుపుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు డెస్టినేషన్ మ్యారేజ్ గా పిలవబడుతున్న ఈ వివాహం ఇండియాలో తొలిసారి చేసుకోబోతుంది అఖిల్, శ్రేయాభూపాల్ జోడేనట. పెళ్లి కూడా జీవీకే స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.  పెళ్లి కోసం ఏకంగా 150 కోట్ల రూపాయలను జీవీకే రెడ్డి ఖర్చుపెట్టబోతున్నారట.

ఇటలీలో జరిగే ఈపెళ్ళికి వచ్చే వారికి ప్రత్యేకంగా విమాన ఖర్చులు, వసతి ఏర్పాట్లు మొత్తం ఖర్చు జీవీకే ఫ్యామిలీనే భరిస్తుందట. సో ఏది ఏమైనా అఖిల్-శ్రీయాల పెళ్లి మాత్రం అంగరంగ వైభవంగా జరగబోతుందన్న మాట.

- Advertisement -