దేశవ్యాప్తంగా మూడో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ప్రధాని నరేంద్రమోడీ,బీజేపీ చీఫ్ అమిత్ షా,కేరళ సీఎం పినరయి విజయన్,ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
పోలింగ్ జరుగుతున్న వేళ ఈవీఎంలో లోపాలపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఏ పార్టీకి ఓటు వేసినా బీజేపీకే పోలవుతోందని కాంగ్రెస్,ఎస్పీ పార్టీలు ఆరోపించాయి. దేశవ్యాప్తంగా ఈవీఎంలన్నింటిలోనూ సమస్యలు ఉన్నాయని అఖిలేష్ యాదవ్ అన్నారు. చాలా చోట్ల ఈవీఎంలు బీజేపీకి అనూకూలంగా పనిచేస్తున్నాయని అన్నారు. ఏ పార్టీకి ఓటు వేసినా బీజేపీకే పోల్ అవుతున్నాయని ఆరోపించారు. రామ్‌పూర్‌లో ఉద్దేశపూర్వకంగా ఇప్పటికే 350కిపైగా ఈవీఎంలను మార్చారని అఖిలేష్ అసహనం వ్యక్తం చేశారు.
కేరళలోని కసారాగాడ్‌లో పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈవీఎంలపై కాంగ్రెస్ బటన్ నొక్కితే బీజేపీకి ఓటు పడినట్టు చూపిస్తోందని తెలిపారు.