Akhilesh:బీజేపీ గ్రాఫ్ పతనమవుతోంది

7
- Advertisement -

దేశంలో బీజేపీ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతుందన్నారు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్. లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ అహంకారానికి చరమగీతం పాడనున్నారని చెప్పారు. యూపీ ప్ర‌జ‌లు ఎస్పీతో పాటు విప‌క్ష ఇండియా కూటమి ప‌క్షాన ఉన్నార‌ని, దేశంలో 140 కోట్ల మంది ప్ర‌జ‌లు బీజేపీని 140 సీట్ల‌కు ప‌రిమితం చేస్తార‌ని వెల్లడించారు.

బీజేపీ ప‌ట్ల జనాగ్ర‌హం పెల్లుబుకుతున్న‌ద‌ని …రైతుల‌కు నీటి స‌ర‌ఫ‌రా కోసం కాషాయ పాల‌కులు ఎలాంటి ఏర్పాట్లూ చేయ‌లేద‌న్నారు. పంట కొనుగోళ్ల‌కు స‌రైన వ్య‌వ‌స్ధ నెల‌కొల్ప‌లేద‌ని…రేష‌న్ పేరుతో ప్ర‌జ‌ల‌ను బీజేపీ ద‌గా చేస్తోంద‌ని మండిప‌డ్డారు. ప్ర‌ధాని మోడీ మ‌న్ కీ బాత్ వినాల‌ని ఇప్పుడు ఎవ‌రూ కోరుకోవ‌డం లేద‌ని, వారు రాజ్యాంగం గురించి వినాల‌ని కోరుకుంటున్నార‌ని చెప్పుకొచ్చారు.

Also Read:కుర్రకారు గుండెల్లో హీట్ పెంచిన రాయ్ లక్ష్మీ!

- Advertisement -