- Advertisement -
ఈవీఎంలపై తనకు నమ్మకం లేదన్నారు ఎస్పీ నేత,మాజీ సీఎం అఖిలేష్ యాదవ్. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై లోక్‌సభలో మాట్లాడిన అఖిలేష్..ఒకవేళ తమ పార్టీ 80 సీట్లు గెలిచినా.. అప్పుడు కూడా ఆ ఈవీఎంలపై భరోసా లేదనే చెబుతానన్నారు.
ఈవీఎంలపై నిన్న కూడా నమ్మకం లేదని, ఇవాళ కూడా ఆ నమ్మకం లేదన్నారు. ఈవీఎంలతో గెలిచినా.. ఆ ఈవీఎంలను తొలగించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కుల గణన చేపట్టకుండా న్యాయం అందించలేమని… ఎన్నికల వేళ కొందరి పట్ల ప్రవర్తనా నియమావళి విషయంలో ఎన్నికల సంఘం ఉదాసీనంగా ఉన్నట్లు తెలిపింది.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఇండియా కూటమి బాధ్యతను మరింత పెంచాయన్నారు. ఉద్యోగాలు ఇవ్వాలని మోదీ సర్కారుకు లేదని, అందుకే పేపర్ లీకేజీలు అవుతున్నట్లు ఆరోపించారు.
Also Read:జికా వైరస్ లక్షణాలు, నివారణ చర్యలు
- Advertisement -