బీహార్‌ ఫలితాలపై అఖిలేష్

7
- Advertisement -

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి విజయంపై స్పందించారు ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్. ఎలక్షన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్‌) ప్రతిపక్ష మహాకూటమి గెలుపును ప్రభావితం చేసిందని అభిప్రాయపడ్డారు.

ఈ ఆటలు ఇతర రాష్ట్రాల్లో సాగవని ..‘బీహార్‌లో ‘సర్‌’ ఆడిన ఆట ఇకపై పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ లేదా ఇతర రాష్ట్రాల్లో సాధ్యం కాదు. ఎందుకంటే ఈ ఎన్నికల కుట్ర ఇప్పుడు బయటపడింది అని ఎక్స్‌ పోస్ట్‌లో విమర్శించారు.

ఉత్తరప్రదేశ్‌లో చేపట్టే ‘సర్‌’ ప్రక్రియ పట్ల తాము అప్రమత్తంగా ఉంటామని అఖిలేష్‌ యాదవ్‌ తెలిపారు. బీజేపీ ప్రణాళికలను అడ్డుకుంటామని అన్నారు. బీజేపీ ఒక పార్టీ కాదు, మోసగాడు అని ఆయన ఆరోపించారు.

- Advertisement -