అఖిల్ కోసమే అనుకున్నారంతా..

253
- Advertisement -

అఖిల్ ఏడాదిన్నర పాటు ఎదురుచూసి మరీ పర్ఫెక్ట్ సబ్జెక్ట్ అండ్ డైరెక్టర్ తో సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు అక్కినేని అఖిల్. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం ఏప్రిల్ మొదటివారంలో షూటింగ్ ప్రారంభించుకునే అవకాశాలున్నాయి.మరోవైపు ఈ చిత్రానికి టైటిల్ పై కొత్త ప్రచారం మొదలైంది.

Akhil Second Movie Confirmed

అఖిల్ సెకండ్ మూవీకి ఆసక్తికరమైన ఓ టైటిల్ ప్రచారంలో ఉంది. అదే ‘జున్ను’. క్యాచీగానూ.. కొత్తగాను ఉన్న ఈ టైటిల్ కు టీం అంతా మొగ్గుతున్నారట. హీరో కేరక్టర్ ను ఇండికేట్ చేసే ఈ టైటిల్ అయితే.. సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నారట. అయితే.. ఇంకా టైటిల్ విషయంలో హీరో అఖిల్.. డైరెక్టర్ విక్రమ్ కె కుమార్.. నిర్మాత నాగార్జునలలో ఎవరి నుంచి అఫీషియల్ స్టేట్మెంట్ మాత్రం రాలేదు. మరోవైపు ఇదే మూవీకి.. ‘హలో గురూ ప్రేమ కోసమే’ అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉంది. జున్ను ఇంకా రిజస్టర్ చేయలేదు కానీ.. ఇది మాత్రం ఇప్పటికే రిజిస్టర్ చేయడం విశేషం.

వీటి కంటే ముందు ‘రా రండోయ్ వేడుక చూద్దాం’ అనే టైటిల్ ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై రిజిస్టర్ చేయడంతో.. ఇది అఖిల్ కోసమే అనుకున్నారంతా. ఇప్పుడీ టైటిల్ అఖిల్ కోసం కాదని.. చైతు కోసం రిజిస్టర్ చేయించారని తెలుస్తోంది.

- Advertisement -