జనవరిలో అఖిల్ మిస్టర్ మజ్ను

517
majnu
- Advertisement -

అక్కినేని అఖిల్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ మజ్ను’. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను అఖిల్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తొలి ప్రేమ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి ఈ సినిమాకి దర్శకత్వంలో వహిస్తున్నాడు. అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ ఫస్ట్ లుక్‌ టీజర్‌ని విడుదల చేసిన చిత్రయూనిట్ తాజాగా దీపావళి కానుకగా రిలీజ్‌ డేట్ పోస్టర్‌ని విడుదల చేసింది.

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జనవరిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్. అయితే, విడుదల తేదీని మాత్రం సస్పెన్స్‌లో ఉంచింది. ఈ చిత్రంలో అఖిల్ సరికొత్తగా గెటప్‌లో కనిపిస్తున్నాడు.

తమన్ సంగీతం అందిస్తుండగా అఖిల్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై చిత్రం నిర్మితమవుతుంది. ఈ సినిమాలో విద్యుల్లేఖారామన్ కీలక పాత్రలో నటిస్తోంది.

నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్‌, హైపర్‌ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: థమన్‌, పాటలు: శ్రీమణి, సినిమాటోగ్రఫీ: జార్జ్‌ సి. విలియమ్స్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, ఆర్ట్‌: అవినాష్‌ కొల్లా, కొరియోగ్రఫీ: శేఖర్‌, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంల: వెంకీ అట్లూరి.

- Advertisement -