సెప్టెంబర్ 30న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్

46
akhil

టాలీవుడ్‌ హీరో అక్కినేని అఖిల్ నటించిన తాజా చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. ఈమూవీ ఇప్పటికే పూర్తై విడుదలకు సిద్ధంగా ఉంది. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజ హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాకి, గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ నిర్మించగా సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను సెప్టెంబర్ 30న రిలీజ్ చేయనున్నారు. సాయంత్రం 06:10 నిమిషాలకు ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ తెలిపారు.

అఖిల్ నటించిన గత మూడు చిత్రాలు ‘అఖిల్’, ‘హలో’, ‘మిస్టర్ మజ్ను’ ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదు. అయితే అఖిల్ కెరీర్‌లో నాలుగవ సినిమాగా రాబోతున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ మాత్రం గ్యారెంటీగా అఖిల్‌కి మంచి కమర్షియల్ హిట్ ఇస్తుందని చిత్రబృందం చాలా నమ్మకంగా ఉంది.

అక్టోబర్ 15న విజయదశమి పండుగ సందర్భంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.