అఖిల్ కి ” ఏజెంట్ ” అగ్ని పరీక్షే !

82
- Advertisement -

అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ” ఏజెంట్ ” . సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ ఈ నెల 28న విడుదల కానుంది. గత రెండేళ్ల నుంచి సెట్స్ పై ఉన్న ఈ మూవీ ఎట్టకేలకు రిలీజ్ అవుతుండడంతో అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ మూవీలో అఖిల్ బాడీ ట్రాన్స్ఫార్మేషన్, హెయిర్ స్టైల్, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, ఇలా అన్నిట్లోనూ కొత్తదనం చూపిస్తుండడంతో కామన్ ఆడియన్స్ లో కూడా ఏజెంట్ మూవీపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ లో అఖిల్ స్క్రీన్ ప్రజెంట్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. .

అఖిల్ హీరోగా ఆరంగేట్రం చేసి 13 ఏళ్ళు అయినప్పటికి ఇంతవరకు సరైన విజయం అందుకోలేదు. అఖిల్ గత చిత్రం మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ యావరేజ్ హిట్ గానే నిలిచింది. దాంతో అఖిల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకోవాలంటే ” ఏజెంట్ ” మూవీ హిట్ కావడం చాలా అవసరం. అలాగే అక్కినేని హీరోలకు రొమాంటిక్ ఇమేజ్ మాత్రమే ఉంది. నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య.. ఇలా ప్రతి అక్కినేని హీరో కూడా రొమాంటిక్ ఇమేజ్ తోనే స్టార్ స్టేటస్ అందుకున్నారు.

కానీ అఖిల్ మాత్రం మొదటి నుంచి కూడా మాస్ ఇమేజ్ కోసం గట్టిగా ట్రై చేస్తున్నాడు. తన మొదటి సినిమా ” అఖిల్ ” తోనే మాస్ లీడ్ లోకి ఎంట్రీ ఇవ్వాలని చూసినప్పటికి ఆ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. ఇక అప్పటి నుంచి వరుసగా రొమాంటిక్ మూవీస్ చేసినప్పటికీ విజయం మాత్రం దక్కలేదు. దాంతో మళ్ళీ మాస్ ఇమేజ్ కోసం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ” ఏజెంట్ ” మూవీ చేస్తున్నాడు. ఈ మూవీతో సరికొత్త అఖిల్ ను చూపిస్తూ మూవీపై భారీ హైప్ క్రియేట్ చేశారు సురేందర్ రెడ్డి. ఈ మూవీతోనైనా ఒక భారీ విజయం తన ఖాతాలో వేసుకొని స్టార్ లీడ్ లోకి ఎంట్రీ ఇవ్వాలని ఈ అక్కినేని కుర్రాడు భావిస్తున్నాడు. మరి అఖిల్ ఆశలు ” ఏజెంట్ ” తోనైనా నెరవేరతాయో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి…

లక్ష్యం, లౌక్యం బాటలోనే రామబాణం.. : టీజీ

క్రికెటర్‌ ముత్తయ్య బయోపిక్‌..800ఫస్ట్‌ లుక్‌

మెగాస్టార్ తో భారీ ఫాంటసీ డ్రామా

- Advertisement -