సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘కూలీ’లో విలన్‌గా మెప్పించిన కింగ్ నాగార్జున, ఇప్పుడు తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రాన్ని కోలీవుడ్ దర్శకుడు రా కార్తిక్ తెరకెక్కించనున్నారు. ఆయన ఇంతకుముందు నితం ఒక వానమ్, ఆకాశం వంటి ఫీల్‌గుడ్ సినిమాలు రూపొందించారు.
ఇప్పటికే తెలిసినట్లుగా, ఈ ప్రాజెక్ట్‌ను మెగాస్టార్ చిరంజీవి ఘనంగా లాంచ్ చేయనున్నారు. పరిశ్రమలోని పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకానున్నారు. ఇక ఈ సినిమాలో నాగార్జున కుమారులు నాగ చైతన్య, అఖిల్ అక్కినేని ప్రత్యేక పాత్రల్లో కనిపించే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
అక్కినేని త్రయం చివరిసారిగా కలిసి నటించిన చిత్రం మనం. బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించి క్లాసిక్‌గా నిలిచింది. #King100 అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా, ఫ్యామిలీ డ్రామా మరియు యాక్షన్ అంశాలతో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్గా రాబోతోందని సమాచారం.
Also Read:మావోల పేరుతో సంచలన లేఖ!

