యాక్షన్ సీన్స్‌కే రూ. 12 కోట్లు

208
Akhil And Vikram K Kumar Movie Budget
- Advertisement -

తన ఇద్దరు కొడుకుల కెరీర్ లను పరుగులు పెట్టించాలని అక్కినేని నాగార్జున గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఈ విషయాన్ని ఏ మాత్రం దాచుకోకుండా ఇప్పటికే పలుమార్లు పైకి చెప్పేశారు కూడా. అందుకు తగ్గట్లుగానే అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై.. తనే నిర్మాతగా తన కుమారులతో సినిమాలు చేస్తున్నారు. మొదటి సినిమా ‘అఖిల్’ నిరాశ పరచడంతో తన ఫోకస్ మొత్తం రెండో సినిమాపై పెట్టాడు అఖిల్‌. ఈ మూవీ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న సంగతి తెలిసిందే. అయితే గత చిత్రాలకు భిన్నంగా ఈసారి అఖిల్ కోసం యాక్షన్ జోనర్‌ను ఎన్నుకున్నాడు విక్రమ్ కె కుమార్. గతంలో ఈయన డైరక్షన్‌లో వచ్చిన సూర్య 24 సినిమాలో ఉన్న రెండు యాక్షన్స్ సీన్స్ చూస్తేనే విక్రమ్ యాక్షన్‌ను ఏ రేంజ్‌లో హ్యాండిల్ చేయగలడో అర్ధమవుతుంది

Akhil-Vikram-Kumar-film-delayed-here-is-why

అఖిల్ సినిమా కోసమైతే ఏకంగా ఫారెన్ ఫైట్ మాస్టర్స్‌ను రంగంలోకి దింపాడు. సినిమా మొదటి షెడ్యూల్ మొత్తం యాక్షన్ సీక్వెన్సెస్ చిత్రీకరించడానికే కేటాయించాడట. షూటింగ్ జరిగిన 20రోజుల్లో కేవలం యాక్షన్ పార్ట్ మాత్రమే చిత్రీకరించినట్లు తెలుస్తోంది. మెట్రో స్టేషన్స్, ఫుడ్ గౌడన్లలో కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించడానికి దాదాపుగా 12 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

Akhil And Vikram K Kumar Movie Budget

కథానాయకుడిగానే కాదు, నిర్మాతగానూ నాగార్జునలో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ‘మనం’, ‘సోగ్గాడే చిన్నినాయన’, ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ ఇలా వరుస విజయాల్ని అందుకొన్నారు. పైగా.. ‘ఈసారి హిట్‌ కొడతాం చూడండి’ అని ఆయన ముందే జోస్యం చెప్పేస్తున్నారు. అఖిల్‌ తదుపరి సినిమా విషయంలోనూ ఆయన విశ్వాసంతో ఉన్నారు. ‘ఈసారి అఖిల్‌ హిట్‌ కొట్టడం ఖాయం’ అని ఈ సినిమా ప్రారంభించిన రోజే చెప్పేశారు. ప్రస్తుతం సిసింద్రీకి ఓ హిట్‌ అందించే పనిలో ఉన్నారు నాగార్జున. అఖిల్‌ కథానాయకుడిగా అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. విక్రమ్‌ కె.కుమార్‌ ఈ చిత్రానికి దర్శకుడు. ఇప్పటికే ఓ షెడ్యూల్‌ పూర్తయింది. అందులో భాగంగా యాక్షన్‌ సన్నివేశాల్ని తెరకెక్కించారు. ఈనెల 12 నుంచి హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్‌ మొదలుకానుంది. ఈసారి అఖిల్‌, ప్రధాన తారాగణంపై టాకీ తెరకెక్కిస్తారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించనున్న ఈ చిత్రం కోసం ప్రస్తుతం కథానాయికని ఎంపిక చేసే పనిలో ఉంది చిత్రబృందం. ‘‘అయిదుగురు కథానాయికల్ని ఆడిషన్స్‌ చేశాం. అందులో ఓ అమ్మాయిని ఎంపిక చేస్తాం. ఈ సినిమా కోసం చాలా టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయి. ‘మనం’, ‘సోగ్గాడే..’, ‘రారండోయ్‌’లా.. ఈసారీ అచ్చమైన తెలుగు పేరే ఎంపిక చేస్తాం’’ అని నాగార్జున చెప్పారు.

- Advertisement -