యంగ్ అండ్ డైనమిక్ స్టార్ అక్కినేని అఖిల్ హీరోగా స్టయిలీష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్’.
ఈ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పవర్ ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు. సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. దేశభక్తి అంశాలతో రూపుదిద్దుకుంటున్న సినిమా కాబట్టి దీన్ని ఆగస్ట్ 12న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు తొలుత భావించారు. కానీ షూటింగ్‌లో ఆలస్యం జరుగుతున్న నేపథ్యంలో విడుదల తేదీ వాయిదా పడే అవకాశం ఉంది. త్వరలోనే విడుదల తేదీకి సంబంధించి డేట్‌ని అనౌన్స్‌చేసే అవకాశం ఉంది.
ఏజెంట్ అఖిల్ సూపర్ మేకోవర్ చేశాడు. ఈ చిత్రంలో యాక్షన్ ప్యాక్డ్ రోల్ లో అఖిల్ కనిపించబోతున్నాడు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.