అఖండ‌ ట్రైలర్‌కు ముహుర్తం ఖరారు..

155
Akhanda
- Advertisement -

న‌ట సింహం బాల‌కృష్ణ హీరోగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం అఖండ‌. సింహా, లెజెండ్ వంటి సూప‌ర్ హిట్ చిత్రాల త‌ర్వాత వ‌స్తోన్న సినిమా కావ‌డంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలున్నాయి. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ చాలావరకూ పూర్తయింది. ఇటీవల వదిలిన టీజర్‌కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. అఖండలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇక సినిమా ట్రైలర్‌ విషయానికొస్తే.. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మే 28వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. నిజానికి ఆ రోజునే సినిమాను విడుదల చేయాలనుకున్నారుగానీ కుదరడం లేదట. అందువల్లనే ఆ రోజున ట్రైలర్ ను ప్లాన్ చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఫస్ట్ సింగిల్ కోసం అభిమానులు ఆతృతతో ఎదురుచూస్తున్నారు.

- Advertisement -