మిలియన్ డాలర్ క్లబ్‌లో అఖండ

36
nbk

నటసింహ నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన అఖండ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా దూసుకుపోతోంది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం యూఎస్ఏలో మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరింది.

రాధాకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ అఖండ చిత్రాన్ని ఓవర్సీస్‌లో విడుదల చేసింది. ఈ చిత్రం ఓవర్సీస్‌లో అనేక రికార్డులను బద్దలు కొట్టి మిలియన్ మార్క్‌ను అధిగమించింది. ఆస్ట్రేలియా, UK మరియు గల్ఫ్‌లో కూడా అఖండ భారీ వసూళ్లను రాబట్టింది.

ఓవర్సీస్‌లో అఖండ మానియా ఇంకా కొనసాగుతుండగా బాలకృష్ణకు అఖండ బిగ్గెస్ట్‌ గ్రాసర్‌గా నిలిచింది.