అఖండ 2 ..రన్‌టైం లాక్!

9
- Advertisement -

బాలకృష్ణ నటిస్తున్న అఖండ 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా డిసెంబర్ 5, 2025న భారీ ఎత్తున విడుదల కానుంది.

సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ తెచ్చుకునే అవకాశం ఉందని అంచనా. తాజా సమాచారం ప్రకారం, అఖండ 2 సినిమా రన్‌టైమ్ సుమారు 165 నిమిషాలు (2 గంటల 45 నిమిషాలు) ఉండే అవకాశం ఉంది. మొదటి భాగం కూడా దాదాపు ఇదే రన్‌టైమ్‌తో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

సమ్యుక్త హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆది పినిశెట్టి విలన్‌గా కనిపించనున్నారు. బజరంగీ భాయీజాన్ ఫేమ్ హర్షాలీ మల్హోత్రా అఖండ 2తో టాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. ఈ చిత్రాన్ని రామ్ అచంట, గోపీ అచంట కలిసి 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.

Also Read:ఆఫ్ఘాన్‌ ప్రయాణీకుల వీసా నిలిపివేత

- Advertisement -