గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను హైలీ యాంటిసిపేటెడ్ ‘అఖండ 2: తాండవం’ కోసం నాల్గవ సారి కొలాబరేట్ అయ్యారు. ‘అఖండ’ కు ఇది సీక్వెల్, మరింత హై -ఆక్టేన్ యాక్షన్, గ్రిప్పింగ్ డ్రామాను ప్రామిస్ చేస్తోంది. ఎం తేజస్విని నందమూరి సమర్పణలో ప్రతిష్టాత్మక 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇక ఇవాళ దర్శకుడు బోయపాటి బర్త్ డే సందర్భంగా అఖండ 2కి సంబంధించిన కీలక అప్‌డేట్ ఇచ్చేశారు. బోయపాటికి బర్త్ డే విషెస్ చెబుతూ రిలీజ్ డేట్ పై వస్తున్న రూమర్స్‌కి క్లారిటీ ఇచ్చేశారు.
ఈ సినిమా సెప్టెంబర్ రేస్ నుంచి వచ్చే ఏడాది సంక్రాంతికి వెళ్లినట్టుగా వార్తలు రాగా అవి కేవలం రూమర్సేనని తెలిపింది చిత్రయూనిట్. సెప్టెంబర్ 25నే దసరా కానుకగా థియేటర్స్ లో అఖండ 2 రాబోతుంది అని కన్ఫర్మ్ చేసేసారు. దీంతో ఈ దసరాకి అఖండ 2 తాండవం ఉండబోతోందని తెలుస్తోంది.
Also Read:లష్కరే తోయిబా అల్తాఫ్ లల్లి హతం!

