అఖండ 2.. నార్త్ అమెరికా వసూళ్లు!

7
- Advertisement -

నందమూరి బాలకృష్ణ హీరోగా…బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అఖండ 2: తాండవం. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది.

దేశంలోనే కాదు ఓవర్సీస్‌లోనూ సత్తాచాటింది. నార్త్ అమెరికా బాక్సాఫీస్‌లో ప్రీమియర్ షోల ద్వారానే ఈ చిత్రం 4.52 లక్షల డాలర్లు వసూలు చేసింది. దీంతో ఈ ప్రాంతంలో బాలయ్య నటించిన సినిమాల్లో ఇది నాలుగో అతిపెద్ద ప్రీమియర్ ఓపెనింగ్‌గా నిలిచింది.

ఇప్పటివరకు నార్త్ అమెరికాలో అఖండ 2 సుమారు 9 లక్షల డాలర్లకు పైగా వసూలు చేసింది. అయితే, మిక్స్‌డ్ రివ్యూలు రావడంతో ఈ ప్రాంతంలో కలెక్షన్లకు కొంత బ్రేక్ పడింది.

Also Read:చరిత్ర సృష్టించిన నాథన్ లైయన్

- Advertisement -