ఉద్యోగుల పని గంటలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో రిలయెన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు చేశారు. ముంబయి టెక్ వీక్ ఈవెంట్‌లో మాట్లాడిన ఆకాశ్.. ఒక ఉద్యోగి ఆఫీసులో గడిపే గంటలను తాను లెక్కించనని, పనిలో నాణ్యతే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. తన జీవితంలో పని, కుటుంబం అత్యంత ప్రాధాన్యమని, ప్రతి ఒక్కరూ తమ ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడం ముఖ్యం అని పేర్కొన్నారు.
కొద్దిరోజుల క్రితం ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీపడాలంటే, దేశంలోని యువత వారానికి 70 గంటలు పనిచేయాలని ఆయన సూచించారు. ఈ వ్యాఖ్యలను కొందరు సమర్థించగా, మరికొందరు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలో తాజాగా ఆకాశ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Also Read:ట్రంప్ – జెలెన్ స్కీ వాగ్వాదం..!