కత్రినా కొత్త బాయ్‌ ఫ్రెండ్‌.. అంబానీ !

355
Akash Ambani and Katrina Kaif spotted partying
- Advertisement -

రణబీర్ కపూర్‌తో బ్రేకప్‌ తర్వాత కత్రినా కైఫ్ మళ్లీ వార్తల్లోకి ఎక్కింది.ముకేశ్ అంబానీ తనయుడు ఆకాశ్ అంబానీతో కత్రినా కలిసి కనిపించడం బీటౌన్ లో హాట్ టాపిక్‌గా మారింది. రన్ బీర్ తో బ్రేకప్ తరువాత కత్రినా ఆకాశ్‌తో డేటింగ్ చేస్తున్నట్టు బాలీవుడ్ కోడై కూస్తోంది. రీసెంట్ గా బిగ్ బీ ఇంట్లో జరిగిన దీపావళి సంబరాలకు తారలంతా హాజరైన విషయంలో తెలిసిందే. ఈ పార్టీకి ఆకాశ్ అంబానీ, కత్రినా కైఫ్‌ జంటగా రావడంతో ఇది అదేనని వార్తలు మొదలయ్యాయి. ఇక ఇప్పుడు కత్రినా కొత్త బాయ్ ఫ్రెండ్ అకాశేనని కన్ఫామ్ అయిపోయింది.

kat

తాజాగా అనిల్ కపూర్ తన జుహు రెసిడెన్సీలో ఓ విందు ఇచ్చాడు. ఈ పార్టీకి కత్రినా, ఆకాశ్ జంటగా హాజరవడం మ్యాటర్ ను కన్ఫామ్ చేస్తోంది. కుందన్ జువల్లరీ ధరించిన కత్రినా తన కట్టుబొట్టుతో పార్టీలో సంప్రదాయబద్ధంగా కనిపించి అందరనీ అవాక్కయ్యేలా చేసింది. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే.. అనిల్ కపూర్ ఇచ్చిన ఈ పార్టీకి రణబీర్ కపూర్ కూడా హాజరయ్యాడు. కానీ, కత్రినా మాజీ ప్రేమికుడి కంట పడకుండా చాలా జాగ్రత్తగా పాటించిందని చెప్పుకుంటున్నారు.

- Advertisement -