అజిత్ బిల్లా..రీ రిలీజ్‌లోనూ అదుర్స్

14
- Advertisement -

సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం రీ రిలీజ్ సినిమాల హవా నడుస్తోంది. అగ్రహీరోలు నటించిన సినిమాలు విడుదలవుతుండటమే కాదు రీ రిలీజ్‌లోనూ సత్తా చాటుతున్నాయి. తాజాగా కోలీవుడ్‌లో అజిత్ కుమార్ హీరోగా విష్ణు వర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ బిల్లా.

2007లో ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేసింది.ఇక తాజాగా రీ రిలీజ్‌లోనూ సత్తాచాటుతోంది. ఇవాళ అజిత్ బర్త్ డే సందర్భంగా కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో రీ రిలీజ్ చేయగా అక్కడ మంచి వసూళ్లను రాబడుతోంది.

మార్నింగ్ షోస్ తో ప్రీ సేల్స్ తోనే 5.48 లక్షల రూపాయల వసూళ్లను రాబట్టింది. నాన్ కన్నడ రీ రిలీజ్ కి ఇదే అత్యధికం. ప్రభు, రహ్మాన్, నయనతార, నమిత కీలక పాత్రల్లో నటించారు. తెలుగులో ప్రభాస్ హీరోగా నటించగా యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు.

Also Read:చిరు..మే డే వింటేజ్ వీడియో

- Advertisement -