మహారాష్ట్రలో గత కొన్నాళ్లుగా తీవ్ర రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆ మద్య శివసేన పార్టీలో చీలిక రావడం, ప్రస్తుతం షిండే శివసేన వర్గం.. థాక్రే శివనేన వర్గం అంటూ రెండుగా విడిపోవడం, ఆ చీలికకు బీజేపీ కారణం కావడం ఇలా మహారాష్ట్ర రాజకీయాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. ఆ తరువాత మళ్ళీ కొన్నాళ్లు ఎన్సీపీ పార్టీలో విభేదాలు తలెత్తడం ఆ పార్టీలోని చాలమంది నేతలు షిండే శివసేన వర్గంలో చేరేందుకు మొగ్గు చూపుతుండడంతో మళ్ళీ మహారాష్ట్ర పాలిటిక్స్ తెరపైకి వచ్చాయి. .
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న విభేదాల కారణంగా ఆ పార్టీ అధినేత శరత్ పవార్ ఆ మద్య అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేశారు. కానీ మళ్ళీ ఆయా నేతలు కార్యకర్తల కోరిక మేరకు తిరిగి పార్టీ అధ్యక్ష పదవి చేపట్టారు. ఇదిలా ఉంచితే ఎన్సీపీలో కీలక నేతగా ఉన్న అజిత్ పవార్ గత కొన్నాళ్లుగా పార్టీలో అసంతృప్తి వెదజల్లుతున్నారు. ఆయన ఏక్ నాథ్ షిండే తో కలిసి బీజేపీతో టచ్ లో ఉంటున్నారని పార్టీ లో చీలిక తెచ్చేందుకు సిద్దమౌతున్నారని వార్తలు వినిపించాయి. 20 ఎమ్మెల్యేలను సైతం తనతో పాటు షిండే వర్గంలో చేరే విధంగా వ్యూహాలు రచిస్తున్నాడని కూడా వార్తలు వచ్చాయి.
Also Read:కాంగ్రెస్ ఐక్యత అంతా డొల్లే..!
కానీ ఆ తరువాత అలాంటిదేమీ లేదని ఆ వార్తలను ఖండిచారు అజిత్ పవార్.. కాగా అజిత్ పవార్ శిండ్ వర్గంలో చేరితే తనకు డిప్యూటీ సిఎం పదవిని ఏక్ నాథ్ షిండే ఆఫర్ చేసినట్లు ప్రస్తుతం నేషనల్ మీడియాలో హాట్ హాట్ డిబేట్లు జరుగుతున్నాయి. ఒకవేళ అజిత్ పవార్ ఎన్సీపీని విడితే ఆ పార్టీకి గట్టి దేబ్బే తగిలే అవకాశం ఉంది. కాగా ఎన్సీపీలో చాలమంది నేతలు అజిత్ పవార్ తో సక్యతగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అజిత్ పార్టీ విడితే ఆయనతో పాటు మరో 20 నుంచి 30 మంది నేతలు కూడా ఎన్సీపీని వీడడం ఖాయం. ప్రస్తుతం ఇదే అంశం ఎన్సీపీని తీవ్రంగా కలవర పెడుతోంది. మరి శివసేన పార్టీ చీలికలో పక్కా స్కెచ్ ఫాలో అయిన షిండే.. ఇప్పుడు ఎన్సీపీలో చీలిక తెచ్చేందుకు శరత్ పవార్ ను వాడుకుంటున్నాట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Also Read:కాంగ్రెస్ జనగర్జన..వీరికే ఛాన్స్