UPSC ఛైర్మన్‌గా డాక్టర్ అజయ్

7
- Advertisement -

యూపీఎస్సీ ఛైర్మెన్‌గా డాక్టర్ అజయ్ నియమితులయ్యారు. 1985 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఐఐటీ కాన్పూర్‌లో చదివారు. గతంలో రక్షణ శాఖ కార్యదర్శి గా పని చేశారు అజయ్ కుమార్.

రక్షణ రంగం మరియు డిజిటల్ రంగాల్లో కీలక సంస్కరణలను ఆయన ముందుండి నడిపించారు. అజయ్ కుమార్ 1985 బ్యాచ్ కేరళ కాడర్ ఐఏఎస్ అధికారి. అమెరికాలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటాలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డాక్టరేట్ (PhD) మరియు అప్లైడ్ ఎకనామిక్స్‌లో మాస్టర్స్ (MS) పూర్తి చేశారు.

అజయ్ కుమార్ 2019 ఆగస్టులో రక్షణ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి, 2022 అక్టోబర్ 31న పదవీ విరమణ చేశారు. ఆయన పదవీకాలంలో దేశ రక్షణ రంగానికి సంబంధించి అనేక మార్గదర్శక సంస్కరణలు చేపట్టారు. ముఖ్యంగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ స్థాపన, అగ్నివీర్ నియామక పథకం ప్రారంభం, ఆత్మనిర్భర్ భారత్ ,రక్షణ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చారు.

Also Read:TTD:అన్నమయ్య సామాజిక కవి

- Advertisement -