మొక్కలు నాటిన అజయ్‌ దేవగణ్‌..

82
ajay

రాజ్య‌స‌భ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంలా ముందుకుసాగుతోంది. సినీ,క్రీడా,రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటుతున్నారు.

తాజాగా ఇవాళ బాలీవుడ్ స్టార్ అజ‌య్ దేవ‌గ‌ణ్…. సంతోష్ కుమార్ తో క‌లిసి మొక్క‌లు నాటారు. ప్ర‌తి ఒక్క‌రు కూడా మొక్క‌లు నాటి పర్యావ‌ర‌ణాన్ని కాపాడాల‌ని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు అజయ్‌.

ఇటీవలె ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు సంజ‌య్ ద‌త్ మొక్క‌లు నాటిన సంగతి తెలిసిందే. గ‌చ్చిబౌలిలోని కేజీఎఫ్ 2 షూటింగ్ జ‌రుగుతున్న ప్ర‌దేశంలో 8 మొక్క‌లు నాటారు.