సూపర్‌స్టార్ రజినీ హీరోగా శంకర్ దర్శకత్వంలో ‘2.ఓ’ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. దాదాపు రూ. 500కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న చిత్రమిది. దర్శకుడు శంకర్ ‘2.ఓ’ని రోబో అంతకుమించి విజువల్ ఎఫెక్ట్స్ ని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణానంతర పనులు పూర్తి చేసుకుంటోంది. వీఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయి.
‘2.ఓ’ సినిమాపై తాజాగా ఓ వార్త వినిపిస్తుంది. అదేంటంటే.. ఈ మూవీలో ఐశ్వర్యారాయ్ కూడా కనిపిస్తారట. ‘రోబో’లో ఐశ్వర్య ప్రేమ కోసం ప్రపంచ వినాశనాన్నే తలపెట్టిన చిట్టి, ఇందులోనూ కీలక పాత్ర పోషిస్తుండగా, అతనికి తన గర్ల్ ఫ్రెండ్‌ను చూసుకునే అవకాశం ఈ సినిమాలో ఉందట. అందుకోసం ఐశ్వర్యారాయ్ గెస్ట్ రోల్ చేస్తున్నారని తెలుస్తోంది. రజనీకాంత్, అమీ జాక్సన్, అక్షయ్ కుమార్ తదితరులు నటిస్తున్న ఈ సినిమా ఈ సంవత్సరం నవంబర్ 29న విడుదలకు సిద్ధంకానుంది.