బచ్చన్‌వారి ఇంటి కోడలు బాలీవుడ్ అందాల తార, మాజీ ప్రపంచ సుందరి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. అయితే మొదట్లో మహిళ ప్రధానమైన సబ్జెక్టులు ఎంచుకున్నా ఆ సినిమాలు బాక్సాఫీసు వద్ద పెద్దగా సక్సెస్ కాక పోవడంతో ఆమె రూటు మార్చి. కరణ్ జోహార్ దర్శకత్వంలో ‘యే దిల్ హై ముష్కిల్’ అనే రొమాంటిక్ ఎంటర్టెనర్లో నటించింది. ఈ మూవీలో తనకంటే చిన్నవాడైన రణబీర్ కపూర్‌తో హాట్ హాట్ రొమాంటిక్ సీన్లుతో రెచ్చిపోయింది. దాంతో ఈ సినిమాపై బాలీవుడ్‌లో అప్పట్లో బాగానే చర్చ జరిగింది. అంతేకాదు ఐశ్వర్యరాయ్ ఇంత హాటుగా, ఘాటుగా రొమాన్స్ చేయడం బచ్చన్ కుటుంబానికి నచ్చలేదని, ఆ సీన్లపై అభిషేక్ తో పాటు అత్తమామలు ఐష్ పై గుర్రుగా ఉన్నారని వదంతులు కూడా వచ్చాయి.
తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆమె ‘ఫన్నీ ఖాన్’ సినిమాలో నటిస్తోంది. ఇందులో రాజ్‌కుమార్ రావుతో సన్నిహిత సన్నివేశాల చిత్రీకరణకు ఐశ్వర్య నో చెప్పినట్టు బాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ సీన్లను తీవ్రంగా వ్యతిరేకించిన ఐశ్వర్య రాయ్ బచ్చన్ సన్నిహిత సన్నివేశాల చిత్రీకరణ వద్దని కరాఖండీగా చెప్పినట్టు తెలుస్తోంది. మ్యూజికల్ కామెడీ అయిన ఈ సినిమాలో అనిల్ కపూర్ కూడా నటిస్తున్నాడు.
2000లో వచ్చిన డొమినిక్ డ్యూరుడెరే ఆస్కార్ చిత్రం ‘ఎవిరీబడీ ఫేమస్’ చిత్రం స్ఫూర్తితో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కాగా, ‘ఏ దిల్ హై ముష్కిల్’ సినిమాలో రణ్‌బీర్ కపూర్‌తో కలిసి రెచ్చిపోయి నటించిన ఐశ్వర్య తాజా నిర్ణయం విని బాలీవుడ్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఆ సినిమాలో సీన్లు చూసిన అత్తమామలు జయాబచ్చన్, అమితాబ్ బచ్చన్‌లు కొంత అసహనానికి గురి కావడమే ఐశ్వర్య తాజా నిర్ణయానికి కారణమని బాలీవుడ్ వర్గాల గుస గుసలు.