లిప్‌లాక్ సీన్లపై ఐశ్వర్య..షాకింగ్ కామెంట్స్!

9
- Advertisement -

ఆమె ను చూస్తే చాలు మనసుకు రెక్కలొచ్చేస్తాయి..కవిత్వం పెల్లుబుకుతుంది..ఆమె యూత్ కలల రాణి.. నడిచే తాజ్ మహల్.. ఆమే బాలీవుడ్ నటి ‘ఐశ్వర్య రాయ్’.ఈ పేరు తలిస్తే చాలు.. ప్రపంచంలోని అందమంతా వచ్చి కంటి ముందు సాక్షాత్కరిస్తుంది. ఆమె వెండితెర మీద కాస్తున్న వెన్నెల. బాలీవుడ్ ,టాలీవుడ్, కోలీవుడ్ నుంచి హాలీవుడ్ అంతా ఆమె అందానికి దాసోహమయింది. ఒక్కముక్కలో చెప్పాలంటే ప్రపంచ సినిమాతెరకు పట్టిన తేనెపట్టు ఐశ్వర్యరాయ్. 1996లో మణిరత్నం దర్శకత్వం నటించిన ఇరువర్ అనే తమిళ చిత్రంతో తెరమీద అడుగు పెట్టిన ఐష్..యే దిల్ హే ముష్కిల్ అంటు సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ తన అందాలను ఆరోబోసి కుర్రకారు గుండెలను పిండేసింది.

1994లో ప్రపంచసుందరి కిరీటం దక్కించుకోవడంతో.. రాత్రికి రాత్రి వాల్డ్ ఫేమస్ అయిపోయింది. 1996లో మణిరత్నం దర్శకత్వం నటించిన ఇరువర్ అనే తమిళ చిత్రం ఆమె తొలి తెర అడుగు. అక్కడి నుంచీ ఐష్ కాంత ఐశ్వర్యరాయ్ ఏనాడూ ప్రేక్షకులను మోసం చేసిందే లేదు. అందాలను పంచుతూ… ప్రేక్షకులతో అనుబంధాలను పెంచుకుంటూ వెళ్తూనే వస్తోంది ఇప్పటికి కూడా.

బాలీవుడ్ హీరోలు కండలవీరుడు సల్మాన్‌ఖాన్, షారుఖ్‌ ఖాన్‌ల నుంచి మొదలుకొని హృతిక్‌రోషన్, రణబీర్‌కపూర్ వరకూ అందరితో రొమాన్స్ సీన్స్ చేసింది ఐష్. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో లిప్ లాక్ సీన్లపై స్పందించింది ఐష్. ఒక నటిగా కండీషన్లు పెట్టుకుంటూ పోతే రాణించలేమని తెలిపింది. కెరీర్ స్టార్టింగ్‌లో కిస్ సీన్లు లాంటివి ఇంటిమేట్ సీన్లు చేయడానికి ఇష్టపడే దానిని కాదని కానీ మారుతున్న కాలానుగుణంగా కొన్ని సీన్స్ డిమాండ్ చేసినప్పుడు చేయకతప్పదని తెలిపింది.

Also Read:కమిటీ కుర్రోళ్లు..విజయోత్సవ వేడుక

ధూమ్ 2 మూవీలో ముద్దు సీన్ జరిగినప్పుడు తన క్యారెక్టర్‌ మాత్రమే చూశానని, అంతేకాని కావాలని ఎవరు ముద్దు పెట్టుకోరని చెప్పింది. ఇక ఆ మూవీలో కిస్ సీన్ షూట్ అయిపోగానే హృతిక్‌కి దూరంగా వెళ్లిపోయానని తెలిపింది. నటిగా పర్‌ఫెక్ట్‌గా ఉండాలని కోరుకుంటానే తప్పా, ఎప్పుడూ హద్దులు దాటి ప్రవర్తించలేదని తెలిపింది ఐశ్వర్య.

- Advertisement -