అభిషేక్‌, ఐశ్వర్య బచ్చన్‌ లొల్లి

174
Aishwarya Rai and Abhishek Bachchan fight over daughter Aaradhya?
- Advertisement -

అభిషేక్‌, ఐశ్వర్య బచ్చన్‌ ల మధ్య మళ్ళీ గొడవ మొదలైంది. ఇప్పటికే అభి, ఐష్ ల మధ్య విబేధాలపై చాలానే వార్తలున్నాయి. వీటికి తోడు మరో విషయంలో కూడా వీరి మధ్య గొడవ స్టార్ట్‌ అయిందట. ఇప్పుడు కూతురు ఆరాధ్య వీరి గొడవకి కారణంగా మారింది.  ప్రస్తుతం కూతురు ఆరాధ్య విషయంలో ఈ అమ్మానాన్నలు ఇద్దరూ తెగ గొడవలు పడిపోతున్నారనే టాక్ వినిపిస్తోంది.
Aishwarya Rai and Abhishek Bachchan fight over daughter Aaradhya?
ఇప్పుడు ఈ గొడవ నాలుగు గోడల స్థాయిని కూడా దాటిపోయి.. విషయం పెద్దోళ్ల వరకూ తీసుకెళ్లే పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. ఇంతకీ అసలు గొడవ ఏంటంటే.. కూతురు ఆరాధ్యను వెండి తెర ముందుకు తేవాలన్నది అభిషేక్ బచ్చన్ ఆలోచన. అందుకే పెద్దయ్యాక తన కూతురు ఎలాగూ స్టార్ అయిపోతుంది కాబట్టి.. ఇప్పటి నుంచి యాక్టింగ్ అలవాటు చేయాలని చూస్తున్నాడట.

కానీ రంగుల ప్రపంచంలో అమ్మాయిల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా అనుభవించి వచ్చిన ఐశ్వర్యరాయ్ మాత్రం.. ఆరాధ్య పెరిగి పెద్దయ్యాక ఏమవ్వాలో తనే నిర్ణయించుకుంటుందని అంటోందట. అంతేకాకుండా వీలైతే రంగుల ప్రపంచానికి దూరంగానే ఉంచాలన్నది ఆమె ఆలోచనగా తెలుస్తోంది. ఈ విషయంలో వీరిద్దరి మధ్య మనస్ఫర్ధలు ఎక్కువగానే ఉన్నట్లు టాక్.

- Advertisement -