రిలయన్స్ జియో టెలికాం రంగానికి చుక్కలు చూపిస్తూ ఆఫర్ల మీద ఆఫర్లను ప్రకటిస్తోంది. కళ్లుమిరుమిట్లు గొలిపే జియో ఆఫర్లు చూసి ఇతర నెట్‌వర్క్ కస్టమర్లంతా జియో బాట పడుతున్నారు. జియో ఎఫెక్ట్ ఎలా తట్టుకోవాలో తెలియక ఇతర నెట్‌వర్క్స్ అన్నీ జియో తరహా ఆఫర్స్ ఇవ్వడం మొదలుపెట్టాయి. ఇప్పుడు రిలయన్స్ జియోకు పోటీగా ఎయిర్ టెల్ తన రూ.99 ప్రీపెయిడ్ ప్లాన్ కు మెరుగులు దిద్దింది.
ఇకపై ప్రతి రోజూ 2జీబీ డేటా చొప్పున 28 రోజుల పాటు సేవలు పొందొచ్చు. ఇప్పటి వరకు రూ.99 ప్లాన్ లో రోజూ ఒక జీబీ డేటా మాత్రమే ఉచితం. రిలయన్స్ జియో రూ.98 ప్లాన్ లో ప్రతిరోజూ 2జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, రోజూ 100 ఎస్ఎంఎస్ లను ఆఫర్ చేస్తోంది. బీఎస్ఎన్ఎల్ కూడా రోజూ 1.5జీబీ డేటాను అందిస్తోంది. ఈ పోటీ నేపథ్యంలో ఎయిర్ టెల్ రూ.99 ప్లాన్ ను అప్ గ్రేడ్ చేసింది. ఇందులో అన్ లిమిటెడ్ కాల్స్, రోజూ 100 ఎస్ఎంఎస్ లను కూడా ఉచితంగా అందిస్తోంది.