ఎన్టీఆర్ బ‌యోపిక్ షూటింగ్ కు ముహుర్తం ఖారారు…

272
NTR-Biopic
- Advertisement -

మాజీ ముఖ్య‌మంత్రి, మ‌హాన‌టుడు నంద‌మూరి తార‌క‌రామారావు జీవిత చ‌రిత్ర ఆధారంగా బ‌యోపిక్ తియ‌నున్న విష‌యం తెలిసిందే. ఈసినిమాను తీస్తున్న‌ట్లు ప్ర‌క‌టించి దాదాపు 3నెల‌ల గ‌డిచిన షూటింగ్ మాత్రం మొద‌లుపెట్ట‌లేదు. దర్శ‌కుడు తేజ ఈప్రాజెక్టు నుంచి త‌ప్పుకోవ‌డం వ‌ల్ల ఇకొంచెం ఆల‌స్యం అయింది. అయితే బాల‌కృష్ణ ఈసినిమాను తీసుకెళ్లి అత‌నికి ఘ‌న విజ‌యాన్ని అందించిన గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి డైరెక్ట‌ర్ క్రిష్ చేతిలో పెట్టిన విష‌యం తెలిసిందే.

NTR-Biopic

ఇక ప్ర‌స్తుతం క్రిష్ ఈసినిమా స్క్రీన్ ప్లే, స్టోరీ మార్పు చేర్పుల‌లో బిజీగా ఉన్నాడు. అంతేకాకుండా న‌టీన‌టుల‌ను కూడా ఎంపీక చేసే ప‌నిలో ఉన్నాడు క్రిష్. ఈసినిమాలో కొంత మంది న‌టిస్తోన్న‌ట్లుగా సోష‌ల్ మీడియాలో ప‌లువురి పేర్లు వినిపిస్తోన్నాయి. అయితే చిత్రబృందం మాత్రం అధికారికంగా ఎవ‌రి పేర్ల‌ను చెప్ప‌లేదు. త్వ‌ర‌లోనే ఈసినిమాకు సంబంధించిన రెగ్యూల‌ర్ షూటింగ్ ను ప్రారంభిస్తోన్న‌ట్లు తెలిపారు చిత్ర‌బృందం.

జులై 5వ తేది నుంచి ఈసినిమా రెగ్యూల‌ర్ షూటింగ్ ను ప్రారంభించ‌నున్నారు. సినిమాలో న‌టించే ప‌లువురు న‌టిన‌టులను కూడా క‌న్ఫామ్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఫ‌స్ట్ షెడ్యూల్ కి సంబంధించిన ప‌లువురు న‌టిన‌టుల‌ను ఎంపీక చేసిన‌ట్టు స‌మాచారం. త్వ‌ర‌లోనే మిగతా పాత్ర‌ల‌కు చెందిన న‌టిన‌టుల‌ను కూడా ఎంపీక చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఫ‌స్ట్ షెడ్యూల్ కి సంబంధించిన షూటింగ్ ను హైద‌రాబాద్ రామోజీ ఫిలీం సిటీలో తెర‌కెక్కించ‌నున్న‌ట్లు తెలిపారు. ఇక ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న విషంయ తెలిసిందే.

- Advertisement -