రూ. 599తో 4 లక్షల ఇన్సురెన్స్‌..ఎయిర్‌టెల్ ఆఫర్

297
airtel
- Advertisement -

టెలికాం సంస్థల నుంచి వస్తున్న పోటీని తట్టుకునేందుకు ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ. 599 ప్లాన్‌తో రీచార్జ్ చేసుకునే వారికి రూ. 4 లక్షల జీవిత బీమా కవరేజ్‌ను అందిస్తామని ఇందుకు ఎలాంటి షరతులు లేవని తెలిపింది.

అంతేగాదు రూ. 599 ప్లాన్‌తో 2 జీబీ డేటా,అన్‌లిమిటెడ్ కాల్స్‌,రోజు 100 ఎస్‌ఎంఎస్‌ అందించనుంది. ఈ రీచార్జ్ వేలిడిటి 84 రోజులు ఉండగా మూడు నెలల పాటు బీమా కవరేజీ కొనసాగుతుందని చెప్పారు. 18–54 ఏళ్ల కస్టమర్లకు ఇది వర్తిస్తుందని ఇందుకోసం ప్రత్యేకంగా వైద్యపరీక్షలు అవసరం లేదని వివరించింది.

భారతి యాక్సా లైఫ్‌ ఇన్సూరెన్స్‌తో ఇందుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించింది. ప్రస్తుతం ఢిల్లీతో పాటు కొన్ని రాష్ట్రాల్లో ఈ ఆఫర్ అందుబాటులో ఉండగా త్వరలో దేశంలోని మిగితా ప్రాంతాలకు విస్తరించనున్నట్లు ఎయిర్ టెల్ కంపెనీ ప్రతినిధులు చెప్పారు.

- Advertisement -