కుప్పం నియోజకవర్గంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలన్నది తన కల అన్నారు సీఎం చంద్రబాబు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి కుప్పంలో పర్యటించిన చంద్రబాబు…అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొని ప్రసంగించారు.
8 సార్లు కుప్పం నుండి ఎమ్మెల్యేగా గెలిచానని..ఏం చేసినా మీ రుణం తీర్చుకోలేనని తెలిపారు. తన రాజకీయాలకు కుప్పం ఓ ప్రయోగశాల అని…17 మంది కొత్త వారిని మంత్రులుగా చేశాం అన్నారు. కుప్పంలో నా సామాజిక వర్గం లేదు గానీ వెనుకబడిన వారే నా సామాజిక వర్గం అన్నారు. 24 మంది మంత్రుల్లో 8 మంది బీసీలకు అవకాశం ఇచ్చాం అన్నారు. కుప్పం ప్రజల ఆశీర్వాదం కోసమే వచ్చానని తెలిపారు.
నా జీవితంలో తొలిసారి జైలుకు పంపారు.. బాధ, ఆవేదన ఉంది..ఇక్కడి ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా చెబుతున్నా.. కుప్పంలో ఎవడైనా రౌడీయిజం చేస్తే, అదే వారి ఆఖరి రోజు అవుతుందని హెచ్చరిస్తున్నాను అని చెప్పారు. కుప్పంను ఓ మోడల్ మునిసిపాలిటీగా తయారు చేస్తాను…ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తాను అని చెప్పారు. కుప్పంలోని నాలుగు మండలాలకు 10 కోట్లు తగ్గకుండా ఖర్చు చేసి అభివృద్ది చేస్తానన్నారు. అన్ని మేజర్ పంచాయితీలకు రెండు కోట్లు, మైనర్ పంచాయితీకి కోటి రూపాయలు ఖర్చు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తాను అని వెల్లడించారు.
కుప్పంలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని నా కోరిక..వీలైనంత త్వరలో ఇక్కడ విమానాశ్రయం వస్తుందన్నారు. ఎయిర్ కార్గో సర్వీస్ ప్రారంభించి మన ఉత్పత్తులు ఎగుమతి చేసుకోవచ్చు… కుప్పం మునిసిపాలిటీ పరిధిలో మల్లానూరు, రాళ్ల బూదుగురు అనే రెండు కొత్త మండలాలు ఏర్పాటు చేస్తున్నాం అన్నారు.కుప్పంను ఎడ్యుకేషనల్ హబ్ గా తయారు చేస్తాను అని స్పష్టం చేశారు.
Also Read:ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్‌కి కోమటిరెడ్డి