రాష్ట్రంలోని వర్షాల పరిస్థితులపై ఏఏఐ ఆరా..

384
aai
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు 6 ప్రతిపాదిత విమానాశ్రయాలపై ఇప్పటికే ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) సర్వే నిర్వహించిన సంగతి తెలిసిందే. సర్వేలో భాగంగా రన్‌వేలు, ఏటీసీకి అనుకూలతలు, ప్రతిపాదిత విమానాశ్రయ స్థలానికి చుట్టుపక్కల భౌగోళిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంది ఏఏఐ.

అయితే ఎడతెరలి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని పలు గ్రామాలు నీట మునిగిన సంగతి తెలిసిందే.ఈ నేపధ్యంలో ఏఏఐ సర్వే చేసిన ఆరు ప్రతిపాదిత విమానాశ్రాయాల్లో వర్షాల పరిస్ధితిపై రిపోర్టు ఇవ్వాలని ఆరు జిల్లాల ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ అధికారులను కోరింది ఏఏఐ.

వరంగల్ జిల్లా మామునూరు,పెద్దపల్లి జిల్లాలో బసంత్ నగర్,నిజామాబాద్‌లోని జక్రాన్‌పల్లి, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అద్దకల్‌, భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాల్లో ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -