బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం…రెండురోజులు వర్షాలు

283
rains
- Advertisement -

ఈశాన్య బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వలన ఈరోజు(ఆగస్టు 19 వ తేదీన) ఉదయం 05.30 గంటలకు ఉత్తర బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఈరోజు(ఆగస్టు 19 వ తేదీన) ఉదయం 08.30 గంటలకు తీవ్ర అల్పపీడనంగా మారి వాయువ్య బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. దీనికి అనుబంధముగా 7.6 km ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకి వెళ్లికొద్దీ నైఋతి దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నది. ఇది పశ్చిమ దిశగా ప్రయాణించి రాగల 24 గంటలలో వాయుగుండముగా మారే అవకాశం ఉంది.

తూర్పు-పశ్చిమ shear zone Lat.21.0 deg.N వెంబడి మధ్య భారతదేశం మీదుగా 3.6 km నుండి 5.8 km ఎత్తు మధ్య కొనసాగుతోంది. ఇది ఎత్తుకు వెళ్ళే కొద్దీ దక్షిణ దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నది.వాయువ్య బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో సుమారుగా ఆగస్టు 23 తేదీన మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.ఈరోజు, రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది.

ఆదిలాబాద్, నిర్మల్, కోమురంభీం –ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్-పట్టణ, వరంగల్- గ్రామీణ, మెహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం మరియు ఖమ్మం జిల్లాలలో ఒకటి రెండుచోట్ల ఈరోజు భారీ నుండి అతిభారీ వర్షాలు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది.

- Advertisement -