జెట్ ఎయిర్ వేస్ ఆఫర్ల వెల్లువ..

194
- Advertisement -

విమాన ప్రయాణికుల ముందు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. భారతీయ మార్కెట్లో పౌరవిమానయానం రంగంలో విపరీతమైన పోటీ నెలకొంది.. దీంతో విమానయాన సంస్థలు భారీగా డిస్కౌంట్‌ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.

గత వారంలో ఎంపిక చేసిన విమానాల్లో ఒక వైపు ప్రయాణానికి రూ. 899కే టికెట్లను అందిస్తామని ఇండిగో, రూ. 1,099కే ఎయిర్ ఏషియా విమానం టికెట్లను ఆఫర్ చేయగా, తాజాగా ఆ జాబితాలో జెట్ ఎయిర్ వేస్ కూడా చేరిపోయింది.
 Airline begins 3-day monsoon sale, prices one-way tickets at Rs 1,111
రెయిన్‌ డీల్స్‌ పేరుతో ఎంపిక చేసిన విమానాల్లో ఎకానమీ క్లాస్‌ టికెట్‌ ధరను రూ.1,111గా నిర్ణయించింది. ప్రయాణికులకు నేటి నుంచి మూడు రోజులపాటు ఆఫర్‌ అమల్లో ఉంటుంది. ఈ ఆఫర్‌లో బుక్‌చేసుకోవాల్సిన ప్రయాణ టికెట్లు జూన్‌ 27 నుంచి సెప్టెంబర్‌ 20 మధ్యలోవి మాత్రమే అయి ఉండాలి.

ఈ ఆఫర్‌ ఎకానమీ క్లాస్‌కు మాత్రమే వర్తిస్తుంది. జెట్‌ ఎయిర్‌వేస్‌ నిర్వహించే విమానాలపైన మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. కోడ్‌షేర్‌, ఇంటర్‌లైన్‌పై ఇది వర్తించదు.

- Advertisement -