భారత గగనతలాన్ని కంటికి రెప్పలా కాపలా కాస్తోన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే 86వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ,కేరళ సీఎంవో భారత వైమానిక దళానికి శుభాకాంక్షలు తెలిపారు. వైమానిక వీరులకు యావత్ దేశం సెల్యూట్ చేస్తోందన్నారు. విపత్తుల సమయంలో బాధితులను కాపాడటంలో ముందుండి పనిచేస్తోందన్నారు.
మీ సేవలను ఎప్పటికీ గుర్తుంచుకుంటామని భారత నావికదళానికి శుభాకాంక్షలు తెలిపింది కేరళ ప్రభుత్వం. ఇటీవల కేరళను వరదలు ముంచెత్తినప్పుడు.. ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో విశేష కృషి చేసింది. ఈ నేపథ్యంలో కేరళ సీఎంవో చేసిన ట్వీట్ అందరిని ఆకట్టుకుంటోంది.
భారత వైమానిక దళాన్ని 1932 అక్టోబర్ 8న ఏర్పాటు చేశారు. వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా.. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఉన్న ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో సిబ్బంది పరేడ్ నిర్వహించారు. అనంతరం వైమానిక దళ సిబ్బంది చేపట్టన విన్యాసాలు అందరిని అలరించాయి. ఎయిర్‌ఫోర్స్‌కి చెందిన ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఆయుధాలు, రాడార్, క్షిపణి వ్యవస్థలను వీక్షించేందుకు సాధారణ ప్రజలకు అవకాశం కల్పిస్తారు.
Indian Air Force (@IAF_MCC): Kerala will remember your service. Thank You. #AFDay2018 pic.twitter.com/CPH3iWqAU0
— CMO Kerala (@CMOKerala) October 8, 2018