సరిహద్దు ప్రాంతాలకు విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు తెలిపింది ఎయిర్ ఇండియా. భారత్- పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది ఎయిర్ ఇండియా. అధికారిక ప్రకటన తర్వాత జమ్మూ కశ్మీర్, శ్రీనగర్, లేహ్, జోధ్పూర్, అమృత్ సర్, భుజ్, జామ్ నగర్, రాజ్ కోట్ నగరాలకు సర్వీసులు రద్దు చేశారు. ఈనెల 15 వరకు విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.
అలాగే ఎయిర్ ఇండియా టెల్ అవీవ్ విమానాలను మే 25 వరకు నిలిపివేసింది. ఇజ్రాయేల్ నగరం టెల్ అవీవ్‌కు నేరుగా సేవలు అందిస్తున్న ఏకైక భారతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా.సాధారణంగా ఢిల్లీ నుండి ఈ నగరానికి వారానికి ఐదు సార్లు విమానాలు నడుపుతోంది.
Also Read:కింగ్డమ్..లేటెస్ట్ అప్‌డేట్!
మే 25 వరకు టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు డబ్బులు రీ ఫండ్ చేస్తామని ఎయిర్ ఇండియా సోషల్ మీడియా ద్వారా తెలిపింది.
Also Read:కింగ్డమ్..లేటెస్ట్ అప్‌డేట్!

