కేసీఆరే నెక్ట్స్‌ సీఎం : అసదుద్దీన్

244
KCR will win again
- Advertisement -

తెలంగాణలో మళ్లీ సర్కారు ఏర్పాటు చేసేది.. టీఆరెస్ పార్టీనేనన్నారు ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ. కేసీఆరే మరోమారు సీఎం అవుతారని అసదుద్దీన్ తేల్చి చెప్పారు. ఇతరపార్టీల్లోని నేతలెవరికీ ఆ స్థాయి లేదని , సర్కారును రద్దుచేసి ముందస్తుకు పోవాలంటే ఎంతో గుండెధైర్యం కావాలన్న అసదుద్దీన్.. అది కేసీయార్ ఒక్కరికే సాధ్యమన్నారు.

KCR will win againనాలుగేళ్లుగా తెలంగాణ ప్రజలకు అందించిన సుపరిపాలనే.. టీఆర్‌ఎస్‌ ను గెలిపించి తీరుతుందన్నారు. తమకు పదవుల మీద ఎప్పుడు ఆశ లేదన్న అసదుద్దీన్.. మైనారిటీలు, బలహీనవర్గాలు, దళితుల సంక్షేమం కోసమే తమ ఎజెండా అని వెల్లడించారు. అందుకే టీఆర్‌ఎస్‌ కు మద్దతు తెలుపుతున్నామన్నారు.

అంతేకాకుండా తాము పుట్టిందే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అని చెప్పుకుంటున్న టీడీపీ తో… హస్తం పార్టీ ఎలా పొత్తు పెట్టుకుంటుందని అసదుద్దీన్ ప్రశ్నించారు. కాంగ్రెస్ టీడీపీ అనైతిక పొత్తును ప్రజలు తిప్పుకొట్టడం ఖాయమన్నారు అసదుద్దీన్.

- Advertisement -