- Advertisement -
కనీస మద్దతు ధర చట్టంపై కేంద్ర స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు ఎఐకేఎస్ జాతీయ సహాయ కార్యదర్శి విజూ కృష్ణన్. ఉద్యమంలో అమరవీరులైన సుమారు ఏడు వందల మంది రైతుల మరణాలకు కేంద్రమే బాధ్యత వహించాలన్నారు.
కనీస మద్దతు ధర చట్టంపై మోడీ మట్లాడలేదని…మా డిమాండ్లలో ఎంఎస్పి చట్టం, విద్యుత్ బిల్లు ఉపసంహరణ, అలాగే రాజధాని పరివాహక ప్రాంతంలో గడ్డి కాల్చిన రైతులపై జరిమానా విధించడాన్ని ఉపసంహరణ చట్టం వెనక్కి తీసుకోవాలన్నారు.
కాని మోడీ ప్రసంగంలో ఆ డిమాండ్ల గురించి ప్రస్తావన లేదన్నారు. అయితే రైతుల ఐక్య పోరాట ఒత్తిడి మేరకే మూడు రైతు చట్టాలను రద్దు చేస్తామని మోడీ సర్కార్ ప్రకటించిందన్నారు.
- Advertisement -