ఉద్యోగులతో సమానంగా ‘AI ఏజెంట్లు’!

5
- Advertisement -

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ఐటీ రంగంలో రాబోయే పెను మార్పులపై కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యాపార రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం మరియు సాంకేతికతపై పెట్టే పెట్టుబడులు వేగంగా పెరుగుతున్నాయని దీనివల్ల మరో మూడేళ్లలో టీసీఎస్ సంస్థలో మానవ ఉద్యోగులతో సమాన సంఖ్యలో ‘AI ఏజెంట్లు’ ఉంటారని అంచనా వేశారు.

టీసీఎస్ 31వ వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశంలో (AGM) వాటాదారులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ కంపెనీ చరిత్రలోనే అత్యంత కీలకమైన, ప్రభావవంతమైన పనులను ప్రస్తుతం చేపడుతోందని పేర్కొన్నారు.ప్రపంచవ్యాప్తంగా ముప్పావు వంతు (75 శాతం) సంస్థలు రాబోయే రెండేళ్లలో తమ సాంకేతిక బడ్జెట్‌ను పెంచాలని భావిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏఐ సాంకేతికతే అన్నారు.

గతంలో ఐటీ సేవల అవసరం లేదనుకున్న సంస్థలు కూడా ఇప్పుడు టీసీఎస్ నైపుణ్యాన్ని కోరుకుంటున్నాయని, దీనివల్ల మార్కెట్ మరింత విస్తరిస్తోందని ఆయన చెప్పారు. 2026 ఆర్థిక సంవత్సరం (FY26) చివరి త్రైమాసికం నాటికి, టీసీఎస్ యొక్క వార్షిక ఏఐ ఆదాయం $2.4 బిలియన్లకు (సుమారు రూ. 20,000 కోట్లు) చేరింది. ఇది త్రైమాసిక చక్రవృద్ది రేటు ప్రకారం 22.4 శాతం వృద్ధిని నమోదు చేస్తోంది.

ఐటీ రంగంలో ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనే ఆందోళనలపై చంద్రశేఖరన్ స్పందిస్తూ ఇది కేవలం కేవలం శ్రమను తగ్గించే సాంకేతికత మాత్రమే కాదని….ఇదొక మేధోపరమైన మౌలిక సదుపాయం అని అభివర్ణించారు. సాఫ్ట్‌వేర్ రూపకల్పన, నిర్వహణలో మానవ శ్రమ అవసరాన్ని ఏఐ టూల్స్ తగ్గిస్తున్నప్పటికీ కంపెనీ వ్యాపార పునాదులు బలంగా ఉన్నాయని, డీల్ పైప్‌లైన్ మునుపెన్నడూ లేనంత బలంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.

Also Read:టీఎంసీపై అధిర్ రంజన్‌ ఫైర్

ఈ ఐదు రంగాలలో టీసీఎస్ ఇప్పటికే ప్రాజెక్టులను నిర్మిస్తూ, డెలివరీ చేస్తోందని చంద్రశేఖరన్ తెలిపారు. కార్పొరేట్ ఏఐ రంగంలో కేవలం సాంకేతిక మోడల్స్ మాత్రమే ముఖ్యం కాదని, క్లయింట్లతో ఉన్న సుదీర్ఘ అనుబంధం, నమ్మకం మాత్రమే కంపెనీలను ముందు వరుసలో నిలబెడతాయని ఆ నమ్మకం టీసీఎస్ సొంతమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -