‘అజ్ఞాతవాసి’ అక్కడ భారీ హిట్

410
Agnyaathavaasi Review
- Advertisement -

పవర్ స్టార్ పవర్ కల్యాణ్ చివరి మూవీ అజ్నాతవాసి డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. చివరి సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్న పవర్ స్టార్ అభిమానులకు నిరాశే ఎదురైంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈసినిమాకు దర్శకత్వం వహించగా..అనిరుథ్ రవిచంద్రన్ సంగీతం అందించారు. ఈమూవీ తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లారు. ఇక దర్శకుడు త్రివిక్రమ్ ఈమూవీ ప్లాప్ నుంచి కోలుకోవడానికి చాలా టైం పట్టిందని చెప్పాలి.

ఈమూవీ తర్వాత ఎన్టీఆర్ తో అరవిందసమేత వీరరాఘవ సినిమాతో తిరిగి ఫామ్ లోకి వచ్చారు. తెలుగులో ప్లాప్ అయిన ఈసినిమాను హిందీలో డబ్బింగ్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. గతేడాది అక్టోబర్ లో మూవీని డబ్బింగ్ చేసి యూట్యూబ్ లో పెట్టగా ఇప్పటి వరకు 100 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకొని సరికొత్త రికార్డును నెలకొల్పింది. దాదాపు 4.6 లక్షలకు పైగా లైక్ లు వచ్చాయి. అజ్నాతవాసి మూవీ దేశవ్యాప్తంగా బిగ్గెస్ట్ డిజాస్టర్స్‌లో మూడో ప్లేస్‌లో నిలిచింది. దీనికంటే ముందు ‘బాంబే వెల్వెట్’ మొదటి స్థానంలో ఉండగా…మహేశ్…‘స్పైడర్’ ఆల్ టైమ్ ఇండియన్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్‌లో రెండో ప్లేస్‌లో నిలిచింది. హిందీలో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన ఒక్కరోజులోనే 17 మిలియన్ వ్యూస్ దక్కించుకుని రికార్డుసృష్టించింది.

- Advertisement -