ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్‌..

11
- Advertisement -

ఛత్తీస్‌గఢ్‌ మళ్లీ కాల్పుల మోతతో దద్దరిల్లింది. తాజాగా దంతెవాడ జిల్లాలో భద్రతాదళాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. దంతెవాడ – బీజాపూర్‌ జిల్లాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తుండగా ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.

ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఘటనాస్థలి నుంచి నక్సలైట్ల మృతదేహాలతోపాటు తుపాకీలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఆపరేషన్‌ కొనసాగుతున్నట్లు వెల్లడించారు.

Also Read:పుష్ప 3పై నిర్మాతల క్లారిటీ!

ఈనెల 20వ తేదీన తుపాకుల మోతతో దండకారణ్యం రక్తసిక్తమైన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో 30 మంది మావోయిస్టులు, ఒక జవాన్‌ మృతి చెందారు.

- Advertisement -