యంగ్ రెబల్ స్టార్ పెళ్లి విషయం పై స్పందించారు ఆయన పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు. నేడు కృష్ణం రాజు పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్యూలో ప్రభాస్ పెళ్లిపై స్పష్టం చేశారు. ప్రభాస్ పెళ్లి గురించి తనను చాలా మంది అడుగుతున్నారని ప్రస్తుతం ప్రభాస్ సాహో సినిమాలో బిజీగా ఉన్నాడని ఆ మూవీ విడుదల అయ్యాక తప్పకుండా ప్రభాస్ పెళ్లి ఉంటుందని తెలిపారు.
తాను 50 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నానని, అప్పట్లో హీరోల మధ్య ఎటువంటి సత్సంబంధాలుండేవో, ఇప్పుడు మహేశ్, ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్ ల మధ్య అటువంటి సంబంధాలే ఉన్నాయని అభిప్రాయపడ్డారు. త్వరలోనే ప్రభాస్ నేను కలిసి నటించబోతున్నామని చెప్పారు.
గోపికృష్ణ మూవీస్ బ్యానర్ లో త్వరలోనే ఓ లవ్ స్టోరీ నిర్మిస్తామని, ఆమూవీలో తాను కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు. ఇటివలే తాను చూసిన సినిమాల్లో మహానటి చాలా బాగుందన్నారు. ఎస్వీ రంగారావు బయోపిక్ చూడాలని ఉందని, ఆయన పాత్రలో ప్రకాశ్ రాజ్ నటిస్తే బాగుంటుందని చెప్పారు.