జీఎస్టీని టార్గెట్‌ చేసిన మరో తమిళ చిత్రం..!

169
After Mersal, another Tamil film Kee mocks GST
- Advertisement -

‘మెర్సల్’ సినిమా తమిళనాటే కాకుండా, దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. స్టార్ హీరో విజయ్ నటించిన ఈ సినిమాలో జీఎస్టీపై ఉన్న డైలాగులు బీజేపీ నేతలను కలవరపరచడమే దీనికి కారణం. ఈ డైలాగులకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడితే, బీజేపీ నేతలు మాత్రం మండిపడ్డారు. After Mersal, another Tamil film Kee mocks GST

మరోవైపు, రజనీకాంత్, విశాల్ ల దగ్గర నుంచి పలువురు తమిళ సినీ ప్రముఖులు మెర్సల్ సినిమాకు మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో విశాల్ నివాసం, కార్యాలయాలపై జీఎస్టీ అధికారుల దాడులు జరిగినట్టు వార్తలు వచ్చిన సంగతి కూడా తెలిసిందే.

అయితే ఇప్పుడు తాగా జీఎస్టీని ఎద్దేవా చేస్తూ మరో తమిళ చిత్రం రాబోతోంది. ‘రంగం’ సినిమా ఫేం జీవా నటించిన ‘కీ’ చిత్రం ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో జీఎస్టీపై విమర్శనాస్త్రాలను ఎక్కుబెట్టారు. అయితే, ఈ ప్రోమోపై ఇంతవరకు బీజేపీ నేతలు ఎవరూ స్పందించలేదు.

- Advertisement -