మ‌రోసారి ఏఎన్నార్ పాత్ర‌లో నాగ చైత‌న్య‌?

365
chaitu, anr
- Advertisement -

అల‌నాటి అందాల తార సావిత్ర జీవిత‌క‌థ ఆధారంగా తెర‌కెక్కిన సావిత్రి సినిమా విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఈసినిమాలో నాగ చైత‌న్య ఏఎన్నార్ పాత్ర‌లో క‌నిపించాడు. ఏఎన్నార్ పాత్ర‌లో నాగ‌చైత‌న్య చాలా అద్భుతంగా న‌టించాడు. సావిత్రి, ఏఎన్నార్ క‌లిసి చాలా సినిమాల్లో న‌టించారు. అందువల్ల మ‌హాన‌టి సినిమాలో ఏఎన్నార్ పాత్ర‌ను కూడా చేర్చారు. దింతో చైతు ని మ‌రోసారి త‌న తాత పాత్ర చేయడానికి బంప‌ర్ ఆఫ‌ర్ వ‌చ్చింది.

chaitu

మాజీ ముఖ్య‌మంత్రి, మ‌హాన‌టుడు ఎన్టీఆర్ జీవిత క‌థ ఆధారంగా బాల‌కృష్ణ బ‌యోపిక్ ను తీస్తోన్న విష‌యం తెలిసిందే. త్వ‌ర‌లోనే ఈసినిమా రెగ్యూల‌ర్ షూటింగ్ ను కూడా ప్రారంభించ‌నున్నారు. ఎన్టీఆర్ , ఏఎన్నార్ లు మంచి స్నేహితులు కావ‌డం వ‌ల్ల ఈసినిమాలో ఏఎన్నార్ పాత్ర ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇద్ద‌రు క‌లిసి ఎన్నో సినిమాల్లో న‌టించారు. ఈసంద‌ర్భంగా ఎన్టీఆర్ బ‌యోపిక్ లో ఏఎన్నార్ పాత్ర కోసం నాగ చైత‌న్య ను సంప్ర‌దించాడు డైరెక్ట‌ర్ క్రిష్.

ntr biopic

ఎన్టీఆర్ బ‌యోపిక్ లో ఏఎన్నార్ పాత్ర‌లో న‌టించాల‌ని చైతూని కోరాడు క్రిష్. ఈసినిమాలో ఏఎన్నార్ పాత్ర నిడివి కూడా ఎక్కువే ఉంటుంద‌ని చెప్పాడ‌ని స‌మ‌చారం. దినిపై సానుకూలంగా స్పందించ‌డు చైతూ. కాస్త స‌మ‌యం ఇవ్వ‌మ‌ని క్రిష్ కు చెప్పాడ‌ట చైతూ. ఇక చైతూ ప్ర‌స్తుతం స‌వ్వ‌సాచి, శైలాజారెడ్డి అల్లుడు అనే రెండు సినిమాల్లో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ బ‌యోపిక్ లో న‌టిస్తాడో లేదో అన్నది చ‌ర్చాంశ‌నీయంగా మారింది. ఎది ఏమైనా త‌న తాత పాత్ర‌లో న‌టించేందుకు చైతూకి వ‌రుస అవ‌కాశాలు వ‌స్తున్నాయంటున్నారు ఫిలిం న‌గ‌ర్ వ‌ర్గాలు.

- Advertisement -