Prabhas:రాజా సాబ్‌ గ్లింప్స్..అదిరే రెస్పాన్స్

13
- Advertisement -

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న క్రేజీ మూవీ “రాజా సాబ్” ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ అందరినీ థ్రిల్ చేస్తోంది. ప్రభాస్ వింటేజ్ లుక్ లో ఛార్మింగ్ గా కనిపించారు. “రాజా సాబ్” సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూఛిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్ లో “రాజా సాబ్” సినిమాను దర్శకుడు మారుతి రూపొందిస్తున్నారు. “రాజా సాబ్” సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో విడుదల చేయబోతున్నట్లు ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ ద్వారా మేకర్స్ అనౌన్స్ చేశారు.

బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ మూవీస్ తో సక్సెస్ కు కేరాఫ్ గా మారిన ప్రెస్టీజియస్ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ “రాజా సాబ్” సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో ఎక్కడా రాజీపడకుండా గ్రాండ్ గా ప్రొడ్యూస్ చేస్తోంది. “రాజా సాబ్” సినిమా తమ సంస్థలో ఒక మెమొరబుల్ మూవీగా మిగిలిపోయేలా నిర్మిస్తోంది. “రాజా సాబ్” సినిమా షూటింగ్ 40 పర్సెంట్ పూర్తయింది. ఆగస్టు 2వ తేదీ నుంచి మరో భారీ షెడ్యూల్ ప్రారంభించబోతున్నారు. డార్లింగ్ ఫ్యాన్స్ కు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్రభాస్ ను స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయబోతున్నారు డైరెక్టర్ మారుతి.

Also Read:“బడ్డీ” సినిమా టికెట్ రేట్ల తగ్గింపు

- Advertisement -