పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదికి కరోనా

246
afridi
- Advertisement -

ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తున్న కరోనా పాకిస్ధాన్‌లోనూ విలయతాండవం చేస్తోంది. కరోనాతో పాక్ ప్రజల జీవన అస్తవ్యస్తం కాగా తాజాగా ఆదేశ క్రికెట్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది కరోనా వైరస్ బారినపడ్డాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు ఆఫ్రిది.

రెండు రోజులుగా తన ఆరోగ్యం బాగోలేదని .. పరీక్షలు చేయించుకోగా కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యిందని తెలిపాడు.తాను త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్ధించాలని ఫ్యాన్స్‌ను ట్విట్టర్ ద్వారా కోరారు ఆఫ్రిది. ఇప్పటికే పాకిస్థాన్ మాజీ క్రికెటర్ జాఫర్ సర్ఫరాజ్ (50), రియాజ్ షేక్ (51) కరోనా వైరస్ కారణంగా చనిపోయిన విషయం తెలిసిందే.

1996లో పాకిస్థాన్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన షాహిద్ అఫ్రిది.. 27 టెస్టులు, 398 వన్డేలు, 99 టీ20 మ్యాచ్‌లాడాడు. విధ్వంసక ఇన్నింగ్స్‌లకి పెట్టింది పేరు ఆఫ్రిది.

- Advertisement -